రుణం` మూవీ రివ్యూ

రుణం` మూవీ రివ్యూ

చిత్రం : రుణం
నటీనటులు: గోపికృష్ణ ,మహేంద్ర, శిల్ప ,తేజు ,ప్రియా అగస్టీన్ , ప్రదీప్ ప్రత్తికొండ తదితరులు
బ్యానర్ : బెస్ట్ విన్ ప్రొడక్షన్
నిర్మాతలు : భీమినేని సురేష్-జి.రామకృష్ణారావు,
మ్యూజిక్ : ఎస్వీ మల్లిక్ తేజ్,
కథ-స్క్రీన్ ప్లే-మాటలు -దర్శకత్వం: ఎస్.గుండ్రెడ్డి,

రేటింగ్ : 3.5/5

రుణానుబంధం ప్రాముఖ్యతను తెలియ చెప్పే కథాంశం తో రూపొందిన చిత్రం ‘రుణం’ . గోపికృష్ణ ,మహేంద్ర, శిల్ప ,తేజు ,ప్రియా అగస్టీన్ హీరో హీరోయిన్లు గా భీమినేని సురేష్-జి.రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇదివరకే ఫస్ట్ లుక్ , ,పాటలు, ట్రైలర్స్ తో ఆకట్టుకుంది . కాగా నేడు (ఈ శుక్రవారం ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి ఆడియెన్స్ ని ఏ మాత్రం ఆకట్టుకుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం …

కథ :
తల్లితండ్రులే లోకం గా బ్రతికే ఒక కుర్రాడు శ్రీను (మహేంద్ర ), చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోయిన సుధీర్ ( గోపికృష్ణ ) రూమ్ మేట్స్ . సుధీర్ ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు… ఆ అమ్మాయి మాత్రం అతన్ని అవసరానికి వాడుకుంటుంది .. ఆ అమ్మాయి అడిగిందల్లా గిఫ్ట్ గా ఇస్తుంటాడు …కానీ ఆ అమ్మాయి అడిగిన సమయానికి ఇవ్వలేకపోతుంటాడు … అయితే ఈ క్రమంలో తన గర్ల్ ఫ్రెండ్ ను వేరే అబ్బాయితో చూసిన సుధీర్ …మన దగ్గర డబ్బు లేకపోబట్టే ఇలా జరిగిందని అనుకుని ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకుంటాడు. ఈ క్రమం లో బాగా చదువుకున్న సుధీర్ తనకున్న నాలెడ్జి తో అకౌంట్ నుంచి డబ్బులు హ్యాక్ చేసే సాఫ్ట్ వేర్ కనిపెడతాడు. ఆ తర్వాత ఎం జరిగింది ..?, ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు అన్నది తెలియాలంటే థియేటర్ లో చూడాల్సిందే ..

నటీ నటులు :

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా గోపికృష్ణ అటు క్లాస్ , మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు . అలాగే మిడిల్ క్లాస్ కుర్రాడు గా, తల్లి దండ్రుల పట్ల ప్రేమానురాగాలు కలిగిన కొడుకుగా మహేంద్ర రాణించాడు. శిల్ప-తేజు-ప్రియా అగస్టీన్ ముగ్గురు హీరోయిన్స్ పర్వాలేదనిపించుకున్నారు. మెయిన్ విల్లన్ గా ప్రదీప్ , మిగతా వారంతా కొత్త వారైనప్పటికీ వారి పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతికవర్గం :

దర్శకుడు ఎస్.గుండ్రెడ్డి ఎంచుకున్న కధ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది, తల్లిదండ్రుల ప్రేమ, స్నేహం గొప్పతనాన్ని చూపించడం లో సక్సెస్ అయ్యాడు .. . సినిమాటోగ్రఫీ చాలా నాసిరకంగా ఉంది . ఇక ఎస్వీ మల్లిక్ తేజ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. పాటలు అన్ని బాగు న్నాయి . . సినిమాకు హైలైట్ అంటే మ్యూజిక్ అని చెప్పొచ్చు . అలాగా భీమినేని సురేష్-జి.రామకృష్ణారావు ల నిర్మాణ విలువలు బాగు న్నాయి .

ప్లస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే
సంగీతం
హీరోలు
దర్శకత్వం
నిర్మాణ విలువలు
కామెడీ

మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ ల్యాగ్
సినిమాటోగ్రఫీ

సమీక్ష :
ఈ చిత్రం ఇద్దరి స్నేహితుల కథ. డబ్బు వారి జీవితాల్ని ఎలా మార్చిందనేది అసలు కథ. వారి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మానవ సంబంధాలపై రాసిన కథ. ప్రతి ఇంటిలోనూ రుణానుబంధాలు ఉంటాయి. ఈ కథ ఫ్యామిలీ ఎమోషన్స్‌ తో కూడిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం. సినిమా ప్రారంభంలో వచ్చే ఫైట్ బాగా కంపోజ్ చేశారు. స్క్రీన్ ప్లే బాగుంది. ఆ తర్వాత వచ్చే పబ్ సాంగ్ ట్రెండీగా ఉంది. హీరో డ్యాన్సులు ఇరగదీశాడు. ఈ పాటకు కొరియోగ్రఫీ బాగుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ మధ్య వచ్చే ట్విస్ట్ బాగుంది. ఈ చిత్రానికి డైలాగులు బాగా కుదిరాయి. డైరెక్టర్‌ ప్రతి పాత్రని చాలా చక్కగా చిత్రీకరించారు.మరో హీరోయిన్ సీత పరిచయం సన్నివేశం కూడా బాగుంది. హీరోయిన్ ఆక్టివ్ గా ఉంది. రుణం టైటిల్ కి దర్శకుడు జస్టిఫికేషన్ బాగా ఇచ్చాడు. సుధీర్, సీత మధ్య లవ్ స్టొరీ బాగుంది.

ఫైనల్ గా…. ఓవరాల్ గా రుణం మెసేజ్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా ఇష్టపడేవారికి రుణం బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రం. సో గో అండ్ వాచ్ ఇట్

You might also like