“ప్రాణం ఖ‌రీదు “మూవీ రివ్యూ

చిత్రం :ప్రాణం ఖ‌రీదు
బ్యాన‌ర్  :ఎన్ యస్ క్రియేషన్స్
న‌టీన‌టులు : తారకరత్న , ప్రశాంత్ , అవంతిక ప‌లువురు
ద‌ర్శ‌క‌త్వం : పియల్ కె రెడ్డి,
నిర్మాత  : కె.యల్.దామోదర ప్రసాద్,
విడుద‌ల 15 మార్చి 2019

Aone Celebrity Rating 3/5

ప్రశాంత్, అవంతిక ,తారకరత్న ప్ర‌ధాన‌పాత్ర‌దారులుగా పి.ఎల్.కె.రెడ్డి దర్శకత్వం వ‌హించిన చిత్రం ప్రాణం ఖ‌రీదు. నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకుల్ని ఎంత‌వ‌ర‌కు ఆకట్టుకుందో లేదో చూద్దాం.

కథ :

ఓ డాక్టర్, ఓ బ్రోకర్ ఓ క్యాబ్ ఎక్కుతారు. ఈ క్యాబ్ డ్రైవర్ ఫస్ట్ మంచిగానే ఉంటాడు. కానీ సడ న్ గా డ్రైవర్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఓ గేమ్ అడుదాం అని భయపెడతాడు. ఇద్దర్ని లాక్ చేస్తాడు. వాళ్ళు భయపడట్లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేని కార్ లో నుంచే గన్ తో షూట్ చేసి చంపుతాడు. ఈ మర్డర్ మిస్టరీ ని ఛేదించేందుకు స్పెషల్ ఆఫీసర్ గా అలెగ్జాండర్ (తారకరత్న) ని నియమిస్తారు. అతనికి సహాయకుడిగా షఫీ ఉంటాడు. తనకు రెస్పెక్ట్ ఇవ్వలేదని… బ్రోకర్ భార్యను కూడా చంపేస్తాడు క్యాబ్ డ్రైవర్. అసలు ఇంతకూ క్యాబ్ డ్రైవర్ ఎవరు. డ్రైవర్ ను, బ్రోకర్ ను ఎందుకు తన కార్ లో లాక్ చేశాడు. ఎందుకు మనీ గేమ్ అడుతుంటాడు. అలెగ్జాండర్ క్యాబ్ డ్రైవర్ ను పట్టుకున్నాడా..? లేదా. .? ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం థియేటర్లో సినిమా చూడాల్సిందే.

సమీక్ష :

హీరో ప్రశాంత్ ఈ సినిమాకు ప్రధాన పిల్లర్ గా నిలిచాడు. విలన్ షేడ్స్ తో వెళ్లే ఈ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. క్యాబ్ డ్రైవర్ గా… డాక్టర్ ను, బ్రోకర్ ను ఆడుకునే సీన్స్ లో అదరగొట్టాడు. లుక్స్ పరంగా, ఫిజిక్ పరంగా, పెర్ ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ తన యాక్టింగ్ తో మెప్పించాడు. హీరో పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని వినియోగించుకుంటే టాలీవుడ్ లో మంచి విల‌క్ష‌ణ న‌టుడిగా ఎదిగే అర్హ‌త‌లు ప్ర‌శాంత్ లో మెండుగా ఉన్నాయి.. హీరోయిన్ అవంతిక మంచి క్యారెక్టర్లో నటించింది. ముఖ్యంగా హాస్పిటల్ సీన్ లో బాగా నటించింది. పోలీసాఫీసర్ గా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా తారకరత్న మరో ప్లస్ పాయింట్ గా నిలిచాడు. యాక్షన్ పార్టులోనూ, క్యాబ్ ను ఛేదించే సీన్స్ లోనూ అదరగొట్టాడు. జెమిని సురేష్, చిత్రం శ్రీను, షఫి సపోర్టింగ్ రోల్స్ లో మెప్పించాడు.

దర్శకుడు కథను కొత్త తరహాలో పరుగెత్తించాడు. స్క్రీన్ ప్లే పరంగాను మంచి మార్కులు కొట్టేశాడు. తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్సుకత రేకెత్తించాడు. ప్రతీ సీన్ ను చాలా కేర్ ఫుల్ గా తీసుకెళ్లాడు. ఆర్టిస్టులతో మంచి పెర్ ఫార్మెన్స్ తీసుకున్నాడు. డైలాగ్స్ విషయంలోనూ ఇంప్రెస్ చేశాడు. కాన్పెప్ట్ ని కొత్తగా ఎగ్జిక్యూట్ చేశాడు. సీరియస్ గా వెళ్తున్నా… సన్నివేశాల్లో కామెడీ పండించి రిఫ్రెష్ చేశాడు. మాస్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు. ఐటమ్ సాంగ్ కూడా పెట్టాడు. డైరెక్టర్ పీఎల్ కే రెడ్డి వైద్య రంగంలో ఉన్న అవయవాల మాఫియాను తెరపై పెట్టడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎడిటింగ్ బాగుంది. మురళీ మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం బాగుంది. రీ రికార్డింగ్ తో సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాడు. ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మెడికల్ ఇండస్ట్రీ లో వుండే చీకటి కోణాలను ప్రధాన అంశంగా చేసుకొని తెరకెక్కిన ఈ ప్రాణం ఖరీదు మంచి రివెంజ్ డ్రామాగా నిలిచింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది.

ఈ తరహా కథ, కథనం మనకు కొత్తగా ఉంటుంది. క‌థ ,క‌థ‌నాలు ప్రేక్షకుల్ని ఆద్యంతం కట్టి పడేస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రం ప్రాణం ఖ‌రీదు..మంచి సినిమా చూడాల‌నుకునే వారు ఏం ఆలోచించకుండా ప్రాణం ఖ‌రీదు కోసం టిక్కెట్లు ఖ‌రీదు చేయ‌వ‌చ్చు.. సో.. గో అండ్ వాచ్..

You might also like