“మౌన‌మే ఇష్టం ” మూవీ రివ్యూ

Mouname Istam Movie Reviewచిత్రం : మౌన‌మే ఇష్టం

బ్యానర్: ఏకే మూవీస్
నటీనటులు: రామ్ కార్తీక్‌, పార్వ‌తి అరుణ్, రీతూ వర్మ, నాజర్, సూర్య తదితరులు
నిర్మాత: ఆశ అశోక్‌ ,
స్కీన్ ప్లే, ద‌ర్శ‌కత్వం: అశోక్ కోరాల‌త్‌, 
క‌థ: సురేష్ గ‌డిప‌ర్తి ,
ఎడిట‌ర్: మార్తాండ్ కే వెంక‌టేష్‌ ,
కెమెరా: జె.డి.రామ్ తుల‌సి
సంగీతం: వివేక్ మ‌హాదేవ
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: రాజీవ్ నాయ‌ర్‌
విడుద‌ల తేది 15 మార్చి 2019

Aone Celebrity Rating : 3.5 / 5

రామ్ కార్తీక్, పార్వతి అరుణ్ హీరో, హీరోయిన్లుగా ప్ర‌ముఖ ఆర్ట్ డైర‌క్ట‌ర్ అశోక్ కోరాల‌త్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మౌతూ తెర‌కెక్కించిన చిత్రం మౌన‌మే ఇష్టం. ఏకే మూవీస్ బ్యాన‌ర్ పై ఆశ అశోక్ నిర్మించిన ఈమూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సరికొత్త ప్రేమ కథతో వచ్చిన ఈ చిత్రం ఎలాంటి ఆద‌ర‌ణను పోందిందో తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే….

క‌థ:

వరుణ్ (రామ్ కార్తీక్) ఓ యాడ్ ఫిలిం మేకర్. త‌న కుటుంబంలో చోటుచేసుకొన్నఓ సంఘటన వ‌ల్ల‌ చిన్నతనంలో తల్లిని కోల్పోతాడు. తండ్రి తాగుడు కు బానిస అవుతాడు. తాత (నాజర్) పెంపకంలో పెరగడంతో తాత మాట‌ల‌ను అనుస‌రిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో సమాజం పై భాధ్యత ఉన్న యువతి మాయ (పార్వతి అరుణ్) వ‌రుణ్ కి తార‌స‌ప‌డుతోంది. మాయ సేవ గుణాన్ని చూసిన వరుణ్ ఆమె ఆకర్షణలో పడిపోతాడు. మాయపై పెరిగిన ఆకర్షణ ప్రేమగా మారుతుంది. కానీ ఆమెకు లవ్ ప్రపోజ్ చేయడానికి ఓ సమస్య ఏర్పడుతుంది. దాంతో ఓ దశలో ఒకరికొకరు దూరమవుతారు. అదే స‌మ‌యంలో తాత (నాజర్) మరణం వ‌రుణ్ ని మరింత బాధపెడుతుంది..వీరిద్ద‌రు ప్రేమికులు ప్ర‌పోజ్ చేసుకోక‌పోవ‌టానికి కార‌ణం ఏంటి… వరుణ్ కుటుంబంలో ఏర్పడిన విషాదం ఏమిటి? మాయ తన తల్లిని ఎందుకు ద్వేషిస్తుంది? మౌనంగా దూర‌మైన వీరిద్ద‌రు ఇష్టంగా క‌లిశారా లేదా అన్న‌ది తెలియాలంటే థియేట‌ర్ కెళ్లి చూడాల్సిందే…

న‌టీన‌టులు :
హీరో రామ్ కార్తీక్ న‌ట‌న ఈ సినిమాకు ప్ల‌స్ అయ్యింది..ఒక‌ర‌కంగా చెప్పాలంటే తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. స‌న్నివేశాన్ని బ‌ట్టి ప‌ర్పామెన్స్ చేశాడు.. ఇక ఈ సినిమాలో పార్వతి అరుణ్ న‌ట‌న‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది . న‌ట‌న‌తో ఆకట్టుకోవ‌డ‌మే కాదు… మంచి ఈజ్‌తో కీలక సన్నివేశాల్లో భావోద్వేగాన్ని పండించింది. చివర్లో తల్లి, కూతుళ్ల మధ్య, వదినతో జరిగే సీన్లలో పార్వతి నటన ఆకట్టుకునేలా ఉంది. తాతగా నాజర్ సినిమాకు ఎమోషనల్ అంశాలను జోడించారు. వరుణ్‌కు తండ్రిగా సూర్య పాత్రకు పెద్ద‌గా స్కోప్ లేదు…ఉన్నంత‌లో ప‌ర్వాలేద‌నిపించాడు.. అభ‌య్ త‌న పాత్ర‌ప‌రిధిలో మెప్పించాడు..మిగ‌తా పాత్ర‌ల‌కు అంత‌గా ప్రాదాన్య‌త లేదు..

సాంకేతిక వ‌ర్గం..
ఆర్ట్ డైరెక్టర్ గా దాదాపు 150 సినిమాలకు పైగా వర్క్ చేసి 5 నంది అవార్డ్స్ గెలుచుకున్న ప్రముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ అశోక్ కుమార్ ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ అయ్యాడు..ప్రతి ప్రేమికుడి ప్రేమకు ప్రపోజల్ ఎంతో ముఖ్యమైనది.. అలాంటి ప్రేమికుడి ప్రేమకు ప్రపోజల్ ఇబ్బంది అయితే ఆ ప్రేమికుడు పడే బాధ ఎంటో అనేది చూపించ‌డంలో ద‌ర్శ‌కుడు అశోక్ కుమార్ పూర్తి స్థాయిలో ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు..ఆర్ట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన అనుభవం తో ప్ర‌తి క్రాప్ట్ నుంచి మంచి అవుట్ పుట్ రాబ‌ట్టుకోగ‌లిగాడు..కథ, కథనాలను న‌డిపించే విధానం అద్యంతం ఆకట్టుకుంటోంది.దర్శకుడిగా ప్రతీ సీన్‌ను ఓ పెయింటింగ్‌గా తెరకెక్కించారు.జె.డి.రామ్ తుల‌సి సినిమాటోగ్ర‌ఫి సినిమాకు మ‌రో హైలెట్ గా నిలిచింది…వివేక్ మ‌హాదేవ సంగీతం ,నేప‌ధ్య‌సంగీతం బాగుంది.. ఎడిటింగ్ పై కాస్త దృష్టి పెట్టుంటే బాగుండేద‌నిపించింది.. అశ అశోక్ ఈ సినిమాను ఎక్క‌డ కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు…ఓవ‌రాల్ గా సినిమా ప్రోడ‌క్ష‌న్ వాల్యూస్ బాగున్నాయి….

విశ్లేష‌ణ :

ఫైనల్‌గా ప్రేక్షకులకు కిక్కించే విధంగా రొమాన్స్, ఎమోషనల్ సీన్స్ , కొత్తదనంతో కూడిన సీన్లు, కథనం ప్రేమకథలో ఉంటేనే ఓ కిక్కు ఉంటుంది..అవ‌న్నీ మౌన‌మే ఇష్టంగా చిత్రంలో ఉన్నాయి…స్వ‌చ్చ‌మైన ప్రేమ‌క‌థ‌ను చూడాల‌నుకునే ప్రేక్ష‌కుల‌కు మౌన‌మే ఇష్టం చిత్రం బెస్ట్ చాయిస్..సో..గో అండ్ వాచ్…

ప్ల‌స్ పాయింట్స్ :

హీరోహీరోయిన్లు
ద‌ర్శ‌క‌త్వం
క‌థ‌
సినిమాటోగ్ర‌ఫి
సంగీతం

రేటింగ్ 3.25 5

You might also like