గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి అందిస్తున్న థ్రిల్లింగ్‌ హారర్‌ మూవీ ‘ఎంతవారలైనా’ 

Horror Thriller 'Yenthavaralaina' Produced by G Seetha Reddy In Guru Chindepalli's Directionరామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మిస్తున్న థ్రిల్లింగ్‌ హారర్‌ మూవీ ‘ఎంతవారలైనా’. ఈ చిత్రంలో అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, సీతారెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ తుదిదశకు చేరుకుంది.

 

ఈ సందర్భంగా దర్శకుడు గురు చిందేపల్లి మాట్లాడుతూ ”ఎంతవారలైనా కాంత దాసులు కావచ్చు, కనకదాసులు కావచ్చు. కానీ, తప్పు చేసినప్పుడు ఎంతవారలైనా కూడా కచ్చితంగా శిక్షార్హులే అనే పాయింట్‌ మీద చేస్తున్న థ్రిల్లర్‌ హారర్‌ మూవీ. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ దాదాపు పూర్తయింది” అన్నారు.

 

నిర్మాత జి.సీతారెడ్డి మాట్లాడుతూ ”దర్శకుడు గురు చిందేపల్లి నా క్లాస్‌ మేట్‌, చిరకాల మిత్రుడు. సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో నిర్మాతనయ్యాను. అలాగే నటన మీద ఉన్న ఆసక్తితోనే డైరెక్టర్‌ ప్రోత్సాహంతో ఈ సినిమాలో ఒక క్యారెక్టర్‌ కూడా చేశాను. గురు చిందేపల్లి చెప్పిన కథ ఎంతో నచ్చి ఈ సినిమాను చేశాం. హైదరాబాద్‌, మైసూర్‌, బెంగళూరు, చిక్‌మంగళూరులలో దాదాపు 60 రోజుల పాటు షెడ్యూల్‌ చేశాం. షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కూడా స్టార్ట్‌ అయ్యింది. త్వరలోనే ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేస్తాం” అన్నారు.

 

అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, సీతారెడ్డి, స్వప్న, అలీషా, అభిలాష్‌, మాస్టర్‌ అయాన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, ఫోటోగ్రఫీ: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి, ఎడిటింగ్‌: వి.నాగిరెడ్డి, ఆర్ట్‌: బాబ్జీ, స్టిల్స్‌: ఈశ్వర్‌, నిర్మాత: జి.సీతారెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గురు చిందేపల్లి
You might also like